02-01-2026 01:14:19 AM
ఎస్పీ నరసింహ
సూర్యాపేట, జనవరి 1 (విజయక్రాంతి) : పోలీసులు అంతా జట్టుగా పనిచేస్తూ నూతన ప్రజలకు విలువైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జిల్లా పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా విధులు నిర్వర్తించారని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదని అభినందించారు.
గత సంవత్సరం సిబ్బంది అంతా బాగా పనిచేశారని రాబోవు రోజుల్లో కూడా లక్ష్యంతో పనిచేసి వేగవంత మైన పోలీసు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారి వెంట అదనపు ఎస్పి లు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహ చారి, రవి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజు భార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హరిబాబు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, రాజశేఖర్, నాగేశ్వరరావు, నరసింహారావు, రామకృష్ణారెడ్డి, శివశంకర్, చరమందరాజు, ఎస్త్స్రలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.