calender_icon.png 20 December, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూజిలాండ్ ఓపెనర్ల ప్రపంచ రికార్డ్

19-12-2025 12:00:00 AM

కాన్వే, లాథమ్  323 రన్స్ పార్టనర్‌షిప్

బే ఓవల్, డిసెంబర్ 18 : ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ చరిత్ర సృష్టించారు. తొలి వికెట్‌కు 323 పరుగులు జోడించి డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డులకెక్కారు. విండీస్‌తో జరుగుతు న్న మూడో టెస్టులో కాన్వే, లాథమ్ ఈ రికార్డు సాధించారు. తద్వారా 2019లో టీమిండియా ప్లేయర్లు రోహిత్‌శర్మ, మయాంక్ అగర్వాల్ చేసిన 317 పరుగుల రికార్డును అధిగమించారు.

అలాగే కివీస్ క్రికెట్ చరిత్రలో 95 ఏళ్ల రికార్డును కూడా వీరిద్దరూ తిరగరాశారు. 1930లో డెంప్సర్, ఎర్నెస్ట్ మిల్స్ ఇంగ్లాండ్‌పై నెలకొల్పిన 276 పరుగుల భాగస్వామ్య రికార్డును సైతం బ్రేక్ చేశారు. ఇదిలా ఉంటే తొలిరోజు న్యూజిలాండ్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఆటముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయి 334 పరుగులు చేసింది. లాథమ్ 137(15 ఫోర్లు, 1 సిక్సర్), కాన్వే 178 నాటౌట్(25 ఫోర్లు), డఫీ 9 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. విండీస్, కివీస్ మధ్య తొలి టెస్ట్ డ్రాగా ముగియగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచి సిరీస్‌లో 1 ఆధిక్యంలో కొనసాగుతోంది.