calender_icon.png 25 May, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై వేటు

24-05-2025 12:53:30 AM

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): అధికారిక అనుమతి లేకుండా నీలోఫర్ ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ మెడికల్ స్టోర్ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు నీలోఫర్ ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ ఎన్.రవి కుమార్‌ను సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ జి.విజయ్ కుమార్‌ను కొత్త సూపరింటెండెంట్‌గా నియమించింది.

ఆసుపత్రి ఆవరణలోని పార్కులో ప్రైవేట్ మెడికల్ స్టోర్ నిర్మాణ పనుల అంశంలో.. ఉన్నతాధికారులు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుమతులతో నిర్మాణం జరుగుతోందని మీడియాకు తప్పుడు వివరణ ఇచ్చినట్టుగా రవికుమార్‌పై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడైంది.

అయితే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రైవేటు మెడికల్ హాల్‌ను అధికారులు కూల్చివేశారు. ఈ నిర్మాణానికి తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తిని అనధికారిక పనులకు వాడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.