24-11-2025 01:17:55 AM
-నాసిరకంతో కట్టడంతోనే చెక్ డ్యాం కూలింది
-పరిశీలించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి, నవంబర్ 23(విజయక్రాంతి): మానేరులో బ్లాస్టింగ్ జరగలేదని, నాసిరకం తో కట్టడంతోనే చెక్ డ్యాం కూలిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. జిల్లాలోని ఓదెల మండలం గుంపుల గ్రా మంలో మానేరుపై కట్టిన చెక్ డ్యాం కూలిన విషయం తెలిసిందే. సంఘటనా స్థలాన్ని స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాళ్ల జేబులు నింపుకునే కోసం నాసిరకం చెక్ డ్యాంలు నిర్మించారని విమర్శించారు. అందులో భాగంగా గుంపులలో కట్టిన చెక్‌డ్యాం నాసిరకం వల్లనే కూ లిందని, ఎలాంటి బ్లాస్టింగ్ కూడా జరగలేదని అన్నారు. అధికారులు, పోలీసులు బ్లాస్టింగ్ విషయంపై ప్రత్యేకంగా ఆరా తీశారని తెలిపారు.
‘నీ హయాంలో మానేరు, హుస్సేన్ మియావాగుపై కడుతున్న చెక్ డ్యాంలను ఎప్పుడైనా వచ్చి పరిశీలించా’ అని మనోహర్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. చెక్ డ్యాం కూలడానికి అప్పటి ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపం, బీఆర్‌ఎస్ నాయ కుల వైఫల్యమేనని అన్నారు.