24-11-2025 01:18:20 AM
బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భూస సారయ్య
బెజ్జూర్, నవంబర్ 23, (విజయ క్రాంతి )బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీలో యువకులు పార్టీలో చేరారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు భూస సారయ్య ఆధ్వర్యం లో బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో యువత పార్టీలు చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
రానున్న రోజుల్లో గ్రామం సుభిక్షంగా ఉండుటకు గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం గ్రామాభివృద్ధి కోసం రాజకీయ బాట ఎంచుకున్నామని యు వకులు అన్నారు. ఏ సమస్య అయినా రాజకీయం తో ముడిపడి ఉందని రాజకీయంతో ముందుకు సాగుతూ గ్రామా న్ని సుభిక్షంగా ఉంచుకొనుటకు మార్గమని రాజకీయంతోనే అభివృద్ధి సాధ్య మని ఆలోచించామని యువకులు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో యువ త పోటీ చేసి గెలిచేందుకు గ్రామంలోని యువత అంతా ఏకమయ్యామని తెలిపారు. ప్రజలందరికీ అండగా ఉంటా నని యువతకు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యక ర్తలు, యువకులు పాల్గొన్నారు.