02-01-2026 12:33:17 AM
చలి నుంచి పేదలను రక్షించవచ్చు: మంత్రి సీతక్క
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): సచివాలయంలో మంత్రి సీతక్కను సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆధ్వర్యంలో సెర్ప్ డైరెక్టర్లు, సిబ్బంది గురువారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి పూల బొకే కాకుండా తెలంగాణ నేతన్నలు తయారు చేసిన దుప్పటిని దివ్య దేవరాజన్ అంజేశారు. దీంతో సెర్ప్ డైరెక్టర్లు, సిబ్బందిని సీతక్క అభినందించారు.
అనంతరం ఆమె రాష్ట్ర ప్రజలందరికీ, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సెర్ప్ డిపార్ట్‌మెంట్ ద్వారా పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. కొత్త ఏడాదిని ఆర్భాటాలతో కాకుండా మానవత్వంతో ప్రారంభించాలని పిలుపునిచ్చారు.