calender_icon.png 2 January, 2026 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో యూరియా కొరత లేదు

02-01-2026 12:32:09 AM

డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కమిషనర్ నాగరాజు

జిల్లాలోని యూరియా పంపిణీ కేంద్రాల్లో పరిశీలన

ఆదిలాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): రాష్ట్రంలోఎక్కడా యూరియా కొరత లేదని, ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కమిషనర్ నాగరాజు రైతాంగానికి వివరించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం పలు మండలాల్లోని యూరియా పంపిణీ కేంద్రాల్లో ఆయన తనిఖీ లు చేపట్టారు.  ఇందులో భాగంగానే గుడిహత్నూర్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించి యూరియా పంపిణీపై రైతులతో మాట్లాడారు. యూరియా యాప్ ద్వారా ఇంటి నుంచే బుకింగ్ సౌకర్యంపై రైతులకు వివరించారు. అదేవిధంగా ఇచ్చోడ మం డలంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆయ న సందర్శించారు.

యూరియా బుకింగ్ యాప్ ద్వారా జరుగుతున్న ఎరువుల విక్రయ ప్రక్రియను జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త సాం కేతికతతో ఎరువుల పంపిణీలో జాప్యం తగ్గుతుందని, రైతులకు పారదర్శకంగా యూరి యా అందుతుందని తెలిపారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి యాప్‌పై వారి అభిప్రాయాలను సేకరించటంతో పాటు, యాప్ వాడకంలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. గతంలో యూరియా కొరకు రైతులు ఒక మండలం నుంచి ఇంకో మండలానికి తిరగవలసి వచ్చేదని, ఎక్కడ స్టాక్ ఉందో తెలియక సమయం, ఖర్చు వృదా అయ్యేదని రైతులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసా య అధికారి శ్రీధర్ స్వామి, పలువురు మండ ల అధికారులు ఉన్నారు.