07-11-2025 12:29:07 AM
-రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం...
-మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : పత్తి రైతులకు న్యాయం జరగాలన్న డిమాండ్ తో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే తనపై, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. గురువా రం మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై మం డిపడ్డారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఎంపీ ఇంటి వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు ప్రయత్నించామని, అయినప్పటికీ పోలీసులు తమను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారన్నారు.
సీసీఐ సంస్థ విధించిన తేమ నిబంధనలు, ఏడు కుంటాళ్ల పరిమితి విధించడంతో పత్తి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. రైతులకు భరోసా కల్పించాల్సి న స్థానిక ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం సరికాదన్న ఆయన... ఇప్పటికైన సీసీఐ నిబంధనలు సడలిస్తేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతాంగానికి న్యా యం జరిగేంత వరకు వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నారా యణ, అజయ్, స్వరూప, దమ్మ పాల్, ఉగ్గే విట్టల్, దయానంద్, వినోద్ పాల్గొన్నారు.