07-11-2025 12:28:33 AM
రైతులు మోస్తాదు యూరియా వాడి పంటలు సాగు చేయాలి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, నవంబర్ 6 : గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రములో గురువారం రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ హాజరై ప్రారంభించి మాట్లాడారు. గతంలో ఈ ప్రాంతంలో కరువు కాటకా లకు నిలయంగా ఉండేది గతంలో కూడా రైతులు పండించిన వరి ధాన్యమును ప్రభుత్వమే కొనుగోలు చేసేదని ఈ ప్రభుత్వాలు వచ్చిన రైతుల సంక్షేమమే కోసం మే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో నే మద్దతు ధర 2386 రూపాయలు కొనుగోలు చేయడం జరిగిందని వారు తెలిపారు.
మహిళలకు ఉపాధి కల్పించాలని మహిళా సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు కూడా ఆర్థికంగా ఎదగాలని ప్రభు త్వం కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ధాన్యము కొనుగోలు చేసిన వెంటనే రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు నమోదు కావడం జరుగుతుందన్నారు . రైతులకు రైతులకు వరి కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని బ్యాగుల కొరత లేకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, డి.ఆర్ విజయ్, విజయ్ భాస్కర్‌రెడ్డి, డి.వై రామన్న, శ్రీరాములు రంగస్వామి, యుగంధర్ గౌడ్, కురుమన్న, కర్రెప్ప, కృష్ణ రెడ్డి, ఐకెపి, మహిళా సంఘ నాయకురాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.