07-05-2025 12:29:39 AM
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణం, వాటికి సంబంధించిన జంక్షన్లు, అనుసంధానత ఉండా లని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్ (దక్షిణ), రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మా ణంపై తన నివాసంలో సీఎం మంగళవా రం రాత్రి సమీక్ష నిర్వహించారు.
రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు. అటవీప్రాంతం, జలవనరులు, మండల కేంద్రాలు, గ్రామాల విషయంలో ముందుగానే లైడర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. అలైన్‌మెంట్ల విషయం లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి పొరపాట్లకు తావివ్వద్దన్నారు. శాటిలై ట్ టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లకు రూపకల్పన చేయాలని సూచించారు.
ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణం ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులు ఆర్‌ఆర్‌ఆర్ వెలుపలికి వెళ్లే ప్రాంతంలో తగు రీతిలో ట్రంపెట్స్ నిర్మించాలని..ఎటువంటి గందరగోళానికి తావులేకుండా, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా దాటేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.
హైదరాబాద్ జాతీ య రహదారిలో ఎలివేటెడ్ కారిడార్, నూత న అలైన్‌మెంట్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ఓఆర్‌ఆర్ నుంచి మంచిర్యాల వరకు నూతన రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రత్యా మ్నాయ అలైన్‌మెంట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
ఆ మార్గంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను పరిశీలించా లన్నారు. ఈ నూతన రహదారులకు సంబంధించి జాతీయ రహదారుల శాఖ అధికా రులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
సమీక్షలో రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వీ శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రత్యేక కార్యదర్శి హరిచందన, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం అదనపు సీఈవో ఈవీ నరసింహారెడ్డి, ఎన్‌హెచ్ ప్రాంతీయ అధికారి శివశంకర్ పాల్గొన్నారు.