12-08-2025 12:32:17 AM
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 11 (విజయక్రాంతి) వాహనదారులు ట్యాక్స్ కట్టుకుంటే ఎటువంటి పెనాల్టీ ఉండదని, అధికారులు పట్టుకుంటే 200% ట్యాక్స్ విధిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. సోమవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాలో పలు సరైన పత్రాలు లేకుండా నడుపుతున్న వాహనాలపై విధించిన కేసులు, ఫైన్ వివరాలు తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు 293 కేసులు నమోదయ్యాయని వాటిపై 64 లక్షల ట్యాక్స్ విధించామని, అందులో భాగంగా ట్యాక్స్ పెనాల్టీ కాంపౌండింగ్ ద్వారా 96 లక్షల ట్యాక్స్ వసూలు చేశామని తెలిపారు. ట్యాక్స్ కట్టని వాహనాలు 5088 ఉన్నాయని, అధికారులు పట్టుకుంటే రెండింతల పెనాల్టీ వసూ లు చేస్తామని తెలిపారు. పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలను విధిగా పునరుద్ధరణ చేసుకోవాలన్నారు. ఇందులో ఎంవీఐ వంశీకృష్ణ, నిర్వాహకురాలు కల్పన ఉన్నారు.