24-10-2025 01:23:38 AM
పెద్దపల్లి జిల్లాలో ఆంధ్రావ్యాపారుల దరఖాస్తులు
ఈ నెల 27న లక్కీ డ్రా
కరీంనగర్, అక్టోబరు 23 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మ ద్యం పాలసీకి స్పందన కరువయింది. ఈ నెల 18 వరకు తొలుత దరఖాస్తు గడువు వి ధించినా స్పందన లేకపోవడంతో 23 వరకు గడువు పొడగించారు. అయితే గడువు పొడగించినా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కేవలం 176 దరఖాస్తులు మాత్రమే పెరిగాయి. ఉ మ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యా ల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఎక్సైజ్ శాఖల పరిధిలో మొత్తం 287 మధ్యం షాపులకుగాను 7364 దరఖాస్తులు వచ్చాయి. ద రఖాస్తుల ద్వారా 220 కోట్ల 92 లక్షల ఆదా యం సమకూరింది.
దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగించారు. లక్కీ డ్రా ను ఈ నెల 27న తీయనున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో 94 దుకాణాలకుగాను 2687 వచ్చాయి. జగిత్యాల జిల్లాలో 71 దుకాణాలకుగాను 1895, పెద్దపల్లి జిల్లాలో 74 దుకా ణాలకుగాను 1424, రాజన్న సిరిసిల్ల జిల్లా లో 48 దుకాణాలకుగాను 1358 దరఖాస్తు లు వచ్చాయి. ప్రభుత్వం గతంలో ఉన్న 2 ల క్షల రూపాయల దరఖాస్తు ఫీజును 3 లక్షల కు పెంచినప్పటికీ ఆదాయం సనుకూర్చుకోవడంలో టార్గెట్ రీచ్ కాలేకపోయింది.
ఆశించిన మేరకు దరఖాస్తులు రాకపోవడంతో లక్ష రూపాయల దరఖాస్తు ఫీజు పెంచినా ఆదాయం గత సీజన్లో వచ్చినదానికంటే ఆ రు కోట్ల రూపాయలు మాత్రమే అధికంగా వచ్చింది. దరఖాస్తుల గడువును పెంచినా గతంలో వచ్చిన దరఖాస్తుల సంఖ్యను రీచ్ కాలేకపోయారు. ప్రస్తుతం ఉన్న దుకాణాల గడువు నవంబర్ 30తో ముగియనుంది. డిసెంబర్ 1 నుండి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.
- పెద్దపల్లి జిల్లాలో ఆంధ్రవ్యాపారుల దరఖాస్తు....
తెలంగాణ మద్యం దుకాణాలు దక్కించుకోవడంలో ఆంధ్రవ్యాపారులు సిండికేట్ గా మారి హైదరాబాద్ పరిసర ప్రాంతాలల్లో మద్యం దుకాణాల్లో పాల్గొంటున్నరన్న ఆందోళన వచ్చిన క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం, గోదావరిఖని ప్రాంతంలోని మద్యం దుకాణాలపై ఆంధ్రా వ్యాపారులు దృష్టిసారించడం విశేషం.
ఇక్కడి షాపుల కో సం కొందరు ఆంధ్రావ్యాపారులు దరఖాస్తులు సమర్పించారు. గతంలోలాగా వ్యాపా రంలో ఆశించిన మేర లాభాలు లేకపోవ డం, దరఖాస్తు ఫీజును ప్రభుత్వం లక్ష రూ పాయలు పెంచడం, స్థానిక వ్యాపారుల పో టీ తగ్గడంతో ఆంధ్రావ్యాపారులు ఇటువైపు దృష్టిసారించారు.