11-12-2025 12:40:13 AM
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గొప్ప విజయం సాధించిందని, ఈ సమ్మిట్‌తో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువె త్తాయ ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. గ్లోబల్ సమ్మిట్ విజయం చూసి హరీశ్‌రావుకు గుబులు పట్టుకుందని విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం ఆయన సీఎల్పీ కార్యాల యంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
బీఆర్‌ఎస్ పాలన.. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. గ్లోబల్ సమ్మిట్ వల్ల దేశ విదేశీ పెట్టుబడులు వచ్చాయని, సీఎం రేవంత్‌రెడ్డి విజన్, దూరదృష్టికి గ్లోబల్ సమ్మిట్ నిదర్శనం అన్నారు. నెలాఖరులోపు కార్పొ రేషన్ చైర్మన్ల పదవులు, బోర్డు పదవులు భర్తీ చేస్తామని తెలిపారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెం ట్లు, ప్రచార కమిటీలు త్వరలో వస్తాయన్నారు.
నిజామాబాద్ ఎమ్మెల్యేగా తన పోటీ అధిష్ఠానం నిర్ణయమని, ప్రస్తుతం ఉన్న పీసీసీ పదవిలో సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ఫ్యూచర్ సిటీలో పార్టీ కోసం స్థలం కేటాయిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌లో లావాదేవీల్లో తేడాల వల్లే కవిత విమర్శలు చేస్తున్నా రని ఆరోపించారు. వందేమాతరం ఆచరించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. బీజేపీ హయాంలో ఓట్ చోరీ 100 శాతం జరుగుతుందని ఆరోపించారు. నెహ్రూ విజన్ వల్లే నేడు దేశం ఈ స్థితిలో ఉందని చెప్పారు.