11-12-2025 12:41:12 AM
అమీన్‌పూర్, డిసెంబర్ 10: కూతురుని ప్రేమించాడని పరువు కోసం యువకుడిని హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన కాకాణి జ్యోతి శ్రవణ్‌సాయి(19) మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్స రం చదువుతున్నాడు. ఇతనికి తల్లిదండ్రులు లేకపోవడంతో అతని పోషణ పెదనాన్న వేం కటేశ్వరరావు చూసుకుంటున్నారు. అయితే శ్రవణ్ సాయి తన పదవ తరగతి స్నేహితురాలితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయం తెలిసి ఇరు కుటుంబీకులు గ తంలో హెచ్చరించారు. అయినప్పటికీ వీరి ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రేమను సహించలేని యువతి కుటుంబీకులు మంగళవారం మధ్యాహ్నం శ్రవ ణ్ సాయిని అతను ఉంటున్న హాస్టల్ నుంచి సృజన లక్ష్మీనగర్‌లోని తమ ఇంటికి తీసుకెళ్లారు.
అతడిపై అత్యంత విచక్షణారహితంగా దాడి చేశా రు. ఈ దాడిలో శ్రవ ణ్ సాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆలస్యం కావడంతో ఆసుపత్రికి చేరుకునేలోపే శ్రవణ్ సాయి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకొని పోలీసు లు దర్యాప్తు చేపట్టి నిందితులపై కిడ్నాప్, హత్య కేసు నమోదు చేశారు.
బ్యాట్‌తో కొట్టిన యువతి తల్లి?
యువతి ఇంటికి శ్రవణ్‌సాయిని తీసుకెళ్లిన త ర్వాత యువతి తల్లి సిరి తన కూతురిపై, శ్రవణ్ సాయిపై బ్యాట్‌తో దాడి చేసినట్టు తెలిసింది. సాయికి కిడ్నీలు దెబ్బతినగా, తలపై అంతర్గత గాయాలు అయినట్టు సమాచారం. కూతురు అస్వస్థతకు గురి కాగా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
ఆమె చేతి విరిగినట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు తెలిసింది. గాయపడ్డ శ్రవణ్ సాయి యువతి ఇంట్లోనే పడి ఉన్నట్టు సమాచారం. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురవడంతో యువతి కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధా రించినట్లు తెలిసింది. అమీన్‌పూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.