calender_icon.png 28 November, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారమే నామినేషన్ల స్వీకరణ జరగాలి

27-11-2025 09:48:50 PM

ఎన్నికల పరిశీలకురాలు హరిత..

గజ్వేల్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ములుగు మండలంలోని చిన్న తిమ్మాపూర్, సింగన్నగూడ గ్రామ పంచాయతీలలో నామినేషన్ ప్రక్రియను జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు హరిత పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నామినేషన్ జరగాలని, ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. నామినేషన్ కేంద్రం చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట జడ్పీ సీఈవో రమేష్, తదితరులు తదితరులు పాల్గొన్నారు.