calender_icon.png 13 September, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో నల్గొండ జిల్లాకు మరిన్ని బస్సులు

13-07-2024 02:26:32 PM

హైదరాబాద్: త్వరలో నల్గొండ జిల్లాకు మరిన్ని బస్సులు తెస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ శనివారం కొత్త బస్సులను ప్రారంభించారు. నల్గొండ-హైదరాబాద్ మధ్య నాన్ స్టాప్ ఏసీ, 3డీలక్స్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ... చెప్పినట్లే మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త బస్సుల్లో నల్గొండకు 100 బస్సులు కేటాయించాలని కోరుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.