calender_icon.png 24 December, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెప్రసీ సర్వే, ఎలక్షన్ డ్యూటీ నగదు వెంటనే చెల్లించాలి

24-12-2025 01:04:27 AM

ములకలపల్లి, డిసెంబర్ 23 (విజయక్రాంతి):రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్య లను వెంటనే పరిష్కరించాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దు బ్బా ధనలక్ష్మి, సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. వారి సమస్యలను పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ మంగళవారం స్థానిక మంగపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వ హించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వైద్యాధికారి సాయి కళ్యాణ్ కు అందజేశా రు.

ఆశాలతో లెప్రసి సర్వే చేయించి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడం సరైనది కాదని,ప్రతి సంవత్సరం లెప్రసి సర్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా ఆశా లను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 50 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని పండుగ,ప్రతి ఆదివారం సెలవు దినా లు ప్రకటించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లి సుజాత, పావని, కుంజా కుమారి, ఇర్ప తిరుపతమ్మ, మీనా కుమారి, నాగలక్ష్మి, దేవి, తదితరులు పాల్గొన్నారు.