calender_icon.png 13 September, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ జిల్లాలో రీజినల్ రింగ్ రోడ్డు వివాదం

13-07-2024 01:12:38 PM

హైదరాబాద్: మెదక్ జిల్లాలో రీజినల్ రింగ్ రోడ్డు వివాదం నెలకొంది. ఆర్ఆర్ఆర్ కోసం భూసర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ప్రాణాలు పోయినా సరే ఆర్ఆర్ఆర్ కి భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చిచెప్పారు. నర్సాపూర్ పరిధిలోని మెదక్-హైదరాబాద్ జాతీయరహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేశారు. రీజినల్ రింగ్ రోడ్డుతో విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమికి భూమి ఇస్తే సర్వేకు సహకరిస్తామని రైతులు వెల్లడించారు.