calender_icon.png 9 December, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉప్పెన’తోనే సినిమా జర్నీ ఆపేద్దామనుకున్నా

09-12-2025 01:16:43 AM

తన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే ఎంతో నేమ్, ఫేమ్ తెచ్చుకుంది అందాల భామ కృతిశెట్టి. ఆ చిత్రంలో పాత్ర బేబమ్మ పేరుతోనే ఇప్పటికీ ఈ బ్యూటీని పిలుచుకునే అభిమానులే ఎక్కువ. అయితే, ‘ఉప్పెన’ తర్వాత సినిమాలు మానేయాలనుకుందట కృతి. ఇందుకు గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలా వివరించింది.. “నిజంగా నటన అనేది డిమాండ్ ఉన్న పనే. అన్నిటికీ సిద్ధమై ఉండాలి. కానీ, మా అమ్మానాన్నలకు, నాకు సినిమా గురించి పెద్దగా తెలియదు.

అయితే, ‘ఉప్పెన’ నా జీవితాన్నే మార్చేసింది. ఆ సినిమాకు పనిచేసేటప్పుడు ఎన్నో విషయాలను నేర్చుకున్నా. షూటింగ్‌లో చాలా విషయాలు గ్రహించాను. ఒక నటిగా సినిమా విషయంలో నాకు కొన్ని అంచనాలుండేవి. అందుకే ‘ఇది చేయడం కష్టం’ అని ఎప్పుడూ చెప్పలేదు. ఆ కారణంగా చాలా ఒత్తిడిగా అనిపించేది. దాంతో ఆ టైమ్‌లో విపరీతంగా జుట్టు రాలిపోయేది. చర్మ సంబంధ సమస్య లతోనూ బాధపడేదాన్ని.

ఆ విషయం అమ్మానాన్నలకు తెలియడంతో ‘కష్టంగా ఉంటే ఇక సినిమా ల్లో చేయొద్దు’ అన్నారు. దీంతో సినిమా జర్నీ ఆపేద్దామనుకున్నా. పరిస్థితులను సమన్వయం చేసుకునే సామర్థ్యం అప్పటికి నాకు లేదు. ‘ఉప్పెన’ చిత్రాన్ని చాలా మంది ఆదరించారు. ప్రేక్షకుల అంత టి ప్రేమను చూసిన తర్వాత సినిమా ల్లో నటించాలని అనుకున్నా” అని తెలి పింది. కృతిశెట్టి ప్రస్తుతం కార్తి సరసన నటిస్తున్న ‘అన్నగారు వస్తారు’ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది.