calender_icon.png 15 September, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20 కోట్లు దాటిన ఎన్‌ఎస్‌ఈ క్లయింట్ ఖాతాలు

31-10-2024 12:18:33 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: తమ క్లయింట్ ఖాతాల సంఖ్య 20 కోట్లు దాటిందని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)  బుధవారం తెలిపింది. ఎనిమిది నెలల క్రితం 16.9 కోట్లు ఉన్న క్లయింట్ కోడ్స్ (ఖాతాలు) శరవేగంగా వృద్ధిచెంది 20 కోట్ల మార్క్‌ను అధిగమించాయని, మొబైల్ ట్రేడింగ్ యాప్స్ విస్తరించడం, ఇన్వెస్టర్ల అవగాహన పెరగడం, ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ చర్యలు ఖాతాల పెరుగుదలకు కారణమని ఎన్‌ఎస్‌ఈ వివరించింది.