calender_icon.png 8 November, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

08-11-2025 07:06:44 PM

యాచారం: విద్యుత్ షాక్ తగిలి ఒక వ్యక్తి  మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని మాల్, గ్రామంలో చోటుచేసుకుంది. సిఐ నందీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం అజలాపురం గ్రామానికి చెందిన మాదగొని వెంకటేష్ గౌడ్, (40) మాల్ లో నూతన ఇళ్లు నిర్మాణం చేస్తున్నాడు.

మధ్యాహ్న సమయంలో ఇల్లు నిర్మాణం పనుల్లో భాగంగా వెంకటేష్ ఇంటికి నీళ్లు కొట్టే సమయంలో ఇల్లుకు అతి సమీపానే ఉన్న విద్యుత్ తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకటేష్ మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. వెంకటేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే  కారణమని బంధువుల ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.