08-11-2025 07:07:52 PM
మర్పల్లి (విజయక్రాంతి): మర్పల్లి మండల కేంద్రలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా మర్పల్లి మండల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నారని, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ.. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని పథకాలను అమలు చేస్తున్నాన్నారు. రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు పండ్లను అందించారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ మర్పల్లి మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామేశ్వర్ రఫీయుద్ధిన్ నర్సింలు యాదవ్ తెలుగు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు