09-12-2025 01:14:50 AM
రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘బెల్లాబెల్లా’తో మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ఇప్పుడు రెండో పాట కూడా వదలనున్నారు.
రవితేజ, డింపుల్ హయతిపై చిత్రీకరించిన మెలోడీ డ్యూయెట్ ఇది. ఇందుకు సంబంధించిన ప్రోమోను సోమవారం విడుదల చేశారు. ‘అద్దం ముందు’ అనే ఈ గీతంలో రవితేజ, డింపుల్ హయతి కెమిస్ట్రీ.. ఫుల్‌సాంగ్‌పై అంచనాలు పెంచేలా చేసింది. ‘అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పను నే..
నా అద్దం అంటె నువ్వే మరి ఏ నిజం దాచలేనే..’ అంటూ సాగుతున్న ఈ పాటకు సంబంధించి పూర్తి లిరికల్ వీడియో డిసెంబర్ 10న రిలీజ్ కానుంది. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూస్తుండగా, సినిమాటోగ్రఫీని ప్రసాద్ మురెళ్ల అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.