15-05-2025 02:10:35 AM
జిల్లా కలెక్టర్ మను చౌదరి
సిద్దిపేట, మే 14 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మరణించిన భూంపల్లి అక్బర్ పేట మండలం పొతారెడ్డిపేట గ్రామానికి చెందిన ఉపాధి హమి మహిళ కూలీ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి అదుకుంటా మని జిల్లా కలెక్టర్ మను చౌదరి చెప్పారు. బుధవారం దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ కలెక్టర్ ను కలిసి కూలీ కుటుంబాలను అదుకొవాలని వినతిపత్రం సమర్పించారు.
ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన మాహిళ కూలీలు చం ద్రవ్వ, దేవవ్వ కుటుంబాలకు ఉపాధి హమి పధకం కింద రెండు లక్షల చోప్పున నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. స్త్రీ నిధి ఇన్సూరెన్స్ కింద పది లక్షల చోప్పున నష్టపరిహారం అం దిస్తామన్నారు. అంతక్రయలకు రూ.5 వేల చోప్పున అందించామని తెలిపారు. కలెక్టర్ కు డిబిఎఫ్ నేత శంకర్ కృతజ్ఞతలు తెలిపా రు. ఈ కార్యక్రమం లో జర్నలిస్టు భీమ్ శేఖర్ పాల్గొన్నారు.