30-08-2025 05:37:34 PM
నివారణ చర్యలు చేపట్టాలని సూచించిన వ్యవసాయ అధికారి అధికారి రాజు
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో తడి హిప్పర్గ, గోజెగావ్, సోనాల, గ్రామాలలో వరుసగా కురిసిన వర్షానికి నీట మునిగిన పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు శనివారం వర్ధ ముంపుకు గురైన పంటలను పరిశీలించారు. వర్షానికి దెబ్బతిన్న పంటలను గ్రామల వారిగా సర్వే చేసి పై అధికారులకు నివేదిక సమర్పిస్తామని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. మండలంలో దాదాపు 2600 ఎకరాల వరకు సోయాబీన్, పత్తి, పెసర, మినుము పంటలు వర్షానికి దెబ్బ తిన్నట్టు గుర్తించడం జరిగిందని అన్నారు.
రైతుల వారిగా ఆయా గ్రామాల ఏఈవోల వద్ద నష్టపోయిన రైతులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఏఈవోలు గ్రామాల వారిగా రైతుల వారిగా నష్టపోయిన రైతుల పంటలను సర్వే చేసి పై అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం వరద తాకిడికి గురైన కంది పంటలో ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మెటలాక్సిల్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క మోడళ్ళ దగ్గర పోయాలి. అలాగే పత్తి పంటలో వేరు కుళ్లు తెగులు నివారణకుకాపర్ అక్సిలోరైడ్ 3గ్రాము లీటర్ నీటిలో కలిపి మొక్క మోడళ్ళ చుట్టూ పోయాలి. మల్టీ కే (13 -0-45) నీటిలో కరిగే ఎరువు 5 – 10 గ్రామాలు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఈ కార్యక్రమంలో ఏఈ వో లు సరోజ, గజనన్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.