calender_icon.png 31 August, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియాలో 77 శాతం బొగ్గు ఉ త్పత్తి : జీఎం రామచందర్

30-08-2025 05:34:21 PM

మణుగూరు,(విజయక్రాంతి): మణుగూరు ఏరియాలో ఆగస్టు  మాసంలో 77% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జి.ఎం దుర్గం రామచందర్  తెలిపారు. శనివారం జిఎం కార్యాలయ  సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆగష్టు నెలకు ఏరియాలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 7 లక్షల 58 వేల 500 టన్నులకుగాను, 5 లక్షల 58 వేల 755 టన్నుల బొగ్గు తీసి మొత్తం 77 శా తం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు.

ఏరియా నుండి 5 లక్షల 82 వేల 755 టన్నుల బొగ్గును, రవాణా చేయడం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 01 ఏప్రిల్, 2025 నుండి 30 ఆగష్టు, 2025 వరకు ప్రొగ్రెస్సివ్ గా 45 లక్షల 19 వేల 605 టన్నులు బొగ్గును రవాణా చేశామని చెప్పారు. వర్షాలతో ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందన్నారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేసిన సంబంధిత అధికారులకు, సూపర్వైజర్స్, యూనియన్ నాయకులకు అభినందనలు తెలిపారు.