calender_icon.png 2 January, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా నిల్వలపై అధికారుల తనిఖీలు

02-01-2026 12:00:00 AM

డిచ్ పల్లి, జనవరి 1 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని ఇందల్వాయి, తిర్మన్ పల్లి, బర్దిపూర్ వ్యవసాయ సహకార పరపతి సంఘాల వ్యవసాయ శాఖ జేడీఏ షర్మీలా, వ్యవసాయ అధికారి శివ సందర్శించి పలు సూచనలు చేశారు. జిల్లాలో అయా పిఎసిఎస్‌లో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి అని గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార అధికారి, మార్క్ ఫెడ్ డియం తో వారు సమీక్ష నిర్వహించిన, శాఖలు తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల వెంట నిజామాబాద్ రూరల్ ఏడిఏ క్రిష్ణ, ఇందల్వాయి మండలం వ్యవసాయ అధికారి శ్రీకాంత్, డిచ్ పల్లి వ్యవసాయ అధికారి ఆంజనేయులు తదితరులు ఉన్నారు.