calender_icon.png 23 August, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రేషన్ కార్డుల జారీలో అధికారుల చేతివాటం

23-08-2025 12:18:24 AM

-ఒక్కో కార్డుకు 2 నుండి 3 వేలు వసూలు 

-మీ సేవా నిర్వాహకులే మధ్యవర్థులు 

 సదాశివనగర్, ఆగస్టు 21 (విజయ క్రాంతి), రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు నూ తనంగా రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా  ప్రభుత్వం చేపట్టింది. దీన్ని ఆసరా చేసుకున్న రెవెన్యూ అధికారులు నూతనంగా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి డబ్బులు  వసూలు చేస్తున్నారు. ఒక్కొ కార్డుకు 200 నుండి 3000 రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.

డబ్బులు చెల్లిస్తే ఏలాంటి విచారణ జరపకుండానే రెండు, మూడు రోజుల్లో రేషన్ కార్డులు జారీ  చేస్తున్నట్టు తెలిసింది.దీనికి మీసేవ నిర్వాహకులు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలిసింది. దరఖాస్తు చేసుకున్నా వారి నుండి డబ్బులు వసూలు చేసి రెవెన్యూ అధికారులకు అప్పచెప్పుతున్నారు. ప్రభుత్వం పేదవారికి రేషన్ కార్డులను అందించే లక్ష్యాన్ని రెవెన్యూ అధికారులు, మీసేవ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటి కైనా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి కార్యకలపాలకు పాడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

డబ్బులు వసూలు చేస్తే  వారిపై చర్యలు తీసుకుంటాం 

ఇప్పటివరకు ప్రతి రోజు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి సంబంధిత రెవిన్యూ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే నూతన రేషన్ కార్డు మంజూరు చేస్తున్నట్లు తహాసిల్దార్ తెలిపారు.కొత్త రేషన్ కార్డుల కోసం డబ్బులు వసూలు పై ఇప్పటివరకు మా దృష్టికి రాలేదని విజయ క్రాంతి ప్రతినిధి తో తెలిపారు. డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

 తాసిల్దార్, సత్యనారాయణ, సదాశివ నగర్