23-08-2025 12:17:45 AM
తూప్రాన్, ఆగస్టు 22 : తూప్రాన్ లో జరగబోయే వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని శివసాయి గార్డెన్ లో పీస్ కమిటీ సమావేశం డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, సామరస్య పూర్వకంగా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించాలని సూచించారు.
దారులకు అడ్డంగా మండపాలు ఉండరాదని, ప్రత్యేకంగా డీజేలను వాడరాదన్నారు. నిర్వాహకులు, కమిటీ సభ్యులు, ప్రజలు పోలీసులతో కలసి సహకరిస్తే ఉత్సవాలు మరింత భద్రతగా, ఆనందంగా సాగుతాయని అన్నారు. ఈ సమావేశంలో సిఐ రంగా కృష్ణ, ఎస్‌ఐ శివానందం, ఎస్‌ఐ సుభాష్ గౌడ్, శివంపేట ఎస్త్స్ర, చేగుంట ఎస్త్స్ర, వెల్దుర్తి ఎస్త్స్ర, నిర్వాహకులు పాల్గొన్నారు.