16 June, 2026 | 3:28 AM

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్తు

16-06-2026 02:21 AM
  1. ఎమ్మెల్యే ముఠా గోపాల్..
  2. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం

ముషీరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముషీరాబాద్ విద్యామండలి డిప్యూటీ ఈవో లక్ష్మణ్ సింగ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ తదితర విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను  అందజేయాలని సూచించారు.

విద్యార్థులు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరింప చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముషీరాబాద్ విద్యామండలి డిప్యూటీ ఈవో లక్ష్మణ్ సింగ్ మాట్లాడుతూ  ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మండల పరిధిలోని 5 స్కూల్ లలో మొదటి విడత ప్రారంభించామని తెలిపారు.

ప్రతిరోజు వివిద రకాల పౌష్టికాహారాన్ని 1515 మంది విద్యార్థులు లబ్ధిపొందుతారని తెలిపారు. మన్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పథకం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీధర్  రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డి. శివ ముదిరాజ్, పి. శ్రీధర్ చారి, డివిజన్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ భక్తియార్, పార్టీ నాయకులు రెబ్బ రామారావు, మున్వర్ చాంద్,  అస్లాం, ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ మహంది భాను, ముషీరాబాద్ విద్యామండలి డిప్యూటీ ఐవోఎస్ నర్సరాజులు పాల్గొన్నారు.