11-02-2025 12:02:42 AM
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): రాబోయే స్థానిక సంస్థలైన ఎంపి టిసి, జెప్పిటిసి ఎన్నికల నిర్వహణ బాధ్యతల ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులను జిల్లా కలె క్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
సోమ వారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష, శిక్షణ కార్యక్రమంలో ఆయన పలు సూచనలు చేశారు. జిల్లాలోని 20 మండలాల్లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను ప్రశాంత వాతావరణం లో ఎన్నికలను నిర్వహించెందుకు ఎన్నికల అధికారులు సూచన మేరకు పని చేయాల న్నారు.
జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు బ్యాలె ట్ పత్రాల ద్వారా జరుగుతాయని, ఎన్నికల నిర్వహణకు అత్యంత భూమికగా ఆర్వోలు ఏఆర్వోలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.అంతకుముందు ప్రజావాణిలో జిల్లా అధికా రులతో మాట్లాడుతూ జిల్లాలోని హాస్టళ్లను ఆ శాఖ అధికారులు దత్తత తీసుకొని నెలలో ఒకరోజు రాత్రి బస చేయాలని క్షుణ్ణంగా హా స్టల్లో తనిఖీలు చేసి విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచిం చారు.