27-10-2025 12:37:49 AM
ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నయీమ్ పాషా
మంచిర్యాల, అక్టోబర్ 26 (విజయక్రాం తి): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో శ్రేష్ట పథకాన్ని ప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నయీమ్ పాషా కోరారు. ఆది వారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ ఈ పథకం ద్వారా వెనుకబడిన షెడ్యూ ల్ క్యాస్ట్ (ఎస్సీ) కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
భారతదేశంలో 21 రాష్ట్రాలలో ఉన్నటువంటి 147 పాఠశాలల్లో విద్యార్థులకు అవకాశం ఉందని, మూడు వేల మంది సీబీఎస్‌ఈ సిలబస్ అవకాశముందన్నారు. తొమ్మిదో తరగతి, 11వ తరగతులలో చేరేందుకు అవకాశం ఉందని, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 30లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
విద్యారంగంలో ఉన్న లోటును పూడ్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వంచే ఆర్థిక సహాయం పొందే స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) నిర్వహించే గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, ప్రైవేటు పాఠశాలల ద్వారా ఈ పథకం అమలు అవుతుందన్నారు.
దీని ద్వారా ఎస్సీ విద్యార్థులకు ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పూర్తి స్థాయి విద్యా అవకాశాలు అందుతాయని, ప్రభుత్వం విద్యార్థుల పాఠశాల, హాస్టల్ ఖర్చులను భరిస్తుందన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా శ్రేష్ట ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎస్సీ కులాల పిల్లలకు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఈ అవకాశాన్ని ఎస్సీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.