16-09-2025 12:33:41 AM
నేరేడుచర్ల, సెప్టెంబర్ 15 : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్దపెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరెట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు తో కలసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న శాఖల అధికారులు పెండింగ్ ఫిర్యాదులపై దృష్టి సారించి తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అధికారి తమ శాఖ సిబ్బందితో రేపు, ఎల్లుండి స్టాప్ మీటింగ్ పెట్టాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి ఫీల్ మీటింగ్ లేదా వెబ్ ఎక్స్ మీటింగ్ పెట్టి సిబ్బందికి సూచనలు జారీ చేయాలని, ఎలాంటి పెండింగ్ పనులు లేకుండ పూర్తి చేయాలన్నారు.
నేడు భూములకు సంబంధించి 10, ఎంపీడీవోలకు 9, వైద్య ఆరోగ్యశాఖకి 2, డిపిఓకి 2, ఇతర అధికారులకు 18 ఫిర్యాదులు ,మొత్తం 41 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పిడి వివి అప్పారావు, డిపిఓ యాదగిరి, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, డి సీ ఓ పద్మ, డి ఈ ఓ అశోక్, డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్, , సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.