calender_icon.png 30 August, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

30-08-2025 12:00:00 AM

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య 

గార్ల, ఆగష్టు 29 (విజయ క్రాంతి ) : ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో శుక్రవారం ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా ఎరువుల వ్యాపారస్తులు బ్లాక్ లో యూరియాను అధిక రేటుకు విక్రయిస్తున్నట్లు తెలితే షాపుల లైసెన్స్ రద్దు చేయాలనీ అన్నారు. ప్రభుత్వ వైద్యులు స్థానికంగా ఉండకపోవడమే కాకుండా,వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిసి వారిపై చర్యలకు ఆదేశించారు.

వైద్యం, రెవిన్యూ, వెలుగు, పోలీస్, పంచాయతీ, ఆర్ అండ్ బి, వ్యవసాయ అధికారులు స్థానికంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శారదా, ఎంపీడీఓ మంగమ్మ, సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, సీఐ రవి కుమార్, ఎస్‌ఐ రియాజ్ పాషా తదితరులు పాల్గొన్నారు.