29-08-2025 11:54:03 PM
గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు యోగేశ్వర్
కుమ్రం భీం ఆసిఫాబాద్ ఆగస్టు 29(విజయక్రాంతి): గ్రామపంచాయతీలో పని చేస్తు న్న కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యోగేశ్వర్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గ్రామపంచా యతీలలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దుచేసి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవా రం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడారు.
పోరాటాలు చేస్తే తప్ప వేతనాలు వచ్చే పరిస్థితి లేదని మూడు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో 51 నీ సవరించాలని కోరారు. కారోబార్ బిల్ కలెక్టర్ లను సహాయ కార్యదర్శిగా నియమించాలని అరులైన సిబ్బందికి ప్రమోషన్ కల్పించి ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.