calender_icon.png 10 September, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యదళారీల వలలో అధికారులు

10-09-2025 12:12:39 AM

  1. స్థానిక చెరువులను కొళ్లగొడుతున్న ఆంధ్ర జాలర్లు

హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోని వైనం

హర్రాజ్ పాటను రద్దు చేయని మత్స్యకార సొసైటీ 

స్థానిక చేపలను ఆంధ్ర ప్రాంతానికి తరలింపు

అడ్డుకున్న మత్స్యకారులపై తప్పుడు కేసులు, బెదిరింపులు 

వార్తా కథనాలు రాసిన జర్నలిస్టులపై బెదిరింపులు

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 9 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ జిల్లాలోని చేపల చెరువులను ఆంధ్ర ప్రాంత జాలర్లు, దళారు లు అమాంతం మింగేస్తున్నారు. స్థానిక మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభు త్వం స్థానిక చెరువులు, కుంటలు, నదులలో సబ్సిడీ చేపలను పంపిణీ చేసింది. స్థానిక మ త్స్యకారులు వారు నేర్చుకున్న వృత్తిని ఆధారంగా చిన్న వలల సహాయంతో చేపలు పట్టి అమ్ముకొని జీవనం సాగించాల్సి ఉంది.

కానీ నిబంధనలకు విరుద్ధంగా  ఆంధ్ర ప్రాంత జాలర్లు స్థానిక మత్స్యకార సొసైటీ లోని కొంతమంది దలారుల సహకారంతో అర్రా స్ పాట ద్వారా స్థానిక చెరువుల్లోని చేపలను బ్యాటరీల సహాయంతో విద్యుత్ షాక్ గురిచేసి భారీ పొడవాటి వలలతో పట్టి అక్రమం గా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఫలితం గా ఈ ప్రాంత మత్స్యకారులు ఉపాధి లేక ఆర్థికంగా చితికి పోతున్నారు.

ఈ విషయాలపై విజయక్రాంతి వరుస కథనాలు ప్రచు రించడంతో జిల్లా ఉన్నతాధికారులతో పా టు మత్స్యశాఖ అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దని అర్రాస్ పాటను రద్దు చేసుకోవాలని సొసైటీ సభ్యులను హెచ్చరించారు. అయినా వినకుండా రాజకీయ పలుకుబడిని ప్రదర్శించ డంతో స్థానిక మత్స్యకారులంతా దళారులు అధికారులకు వ్యతిరేకంగా కోర్టుమెట్లు ఎక్కి విజయం సాదించారు.

అయినా హైకోర్టును ఆశ్రయించిన దళారులకు చెంపపెట్టు సమాధానం ఇస్తూ స్థానిక మత్స్యకారులే చెరువు లోని చేపలు పట్టుకోవాలని హైకోర్టు ఆదేశించింది. భారీ వలలను వినియోగించ కుండా ఈ ప్రాంత వాసులే పట్టుకొని జీవ నం సాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ నే పద్యంలో అర్రాస్ పేటకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్థానిక మత్స్యకారులను దళారులు అధికారుల అండతో బెదిరింపులకు పాల్పడుతూ తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని స్థాని క మత్స్యకారులు ఆరోపించారు. వరుస కథనాలు ప్రచురిస్తున్న విజయక్రాంతి ప్రతినిదికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతుండడం విశేషం. 

దళారుల వలలో అధికారులు.!

తెలంగాణ ప్రాంత చెరువులు కుంటలు నదుల్లో పెరుగుతున్న చేపలపై ఆంధ్ర ప్రాం తానికి చెందిన దళారులు జాలర్లు పెత్తనం చెలాయిస్తూ ఈ ప్రాంత మత్స్యకార సొసైటీ నేతలకు ముడుపులు ఆశ చూపుతున్నారని నిబంధనలకు విరుద్ధంగా చేపలు పడుతున్న వారిని అడ్డుకుంటున్న మత్స్యకారులను సై తం బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థాని క మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మత్స్యశాఖ, పోలీస్ శాఖ అధికారులకు సైతం ముడుపులు ముట్టజెప్పడం వల్లే ఆంధ్ర ప్రాంత జాలర్ల వలలో పడి ఈ ప్రాం త మత్స్యకారులకు అధికారులు సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు. హైకోర్టు నుం డి వచ్చిన ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా భారీ వలల సహాయంతో చేపలు పడుతున్న దళారులకే అంట కాగుతున్నారని మండిపడుతున్నారు. 

 సొసైటీలోని సభ్యులు మాత్రమే చేపలు పట్టుకోవాలి.

ప్రస్తుతం కేసరిసముద్రం చెరువు సొసైటీ సభ్యులు 340 మందికి మాత్రమే చెరువులోని చేపలు పట్టుకునే హక్కు ఉన్నది. చేప లు పట్టుకునే మత్స్యకారులకు సైతం రక్షణ చర్యలు తీసుకోవాలని సొసైటీ సభ్యులకు సూచించాం. చేపలు పడుతున్న వారి పూర్తి వివరాలను కూడా అడిగాం.

కానీ ఆంధ్ర ప్రాంత జాలర్లు చేపల చెరువులోకి దిగితే కఠినంగా వ్యవహరిస్తాం. భారీ వలలు బ్యాటరీలు వంటివి వినియోగిస్తే క్రిమినల్ కేసులు కూడా తప్పవు. హైకోర్టు ఉత్తర్వుల్లోనూ ఇవే అంశాలు ఉన్నాయి. 

 రజిని, మత్స్యశాఖ అధికారిని, నాగర్‌కర్నూల్‌జిల్లా.