calender_icon.png 19 September, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేటలో ఆయిల్‌ఫామ్ సాగు భేష్..

19-09-2025 12:37:08 AM

- సిద్దిపేటలో ఆయిల్‌పామ్ విప్లవం

- ‘ఆధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ’జీరో లిక్విడ్ డిశ్చార్జ్

- ‘ఆయిల్ పామ్ సాగులో సిద్దిపేట పెద్ద పీట

- సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రూ 300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం 

- పర్యావరణ హితమైన విధానాలు,జీరో లిక్విడ్ డిశ్చార్జ్ యూనిట్

- ప్రత్యక్షంగా పరోక్షంగా 2500 మందికి ఉపాధి

నంగునూరు, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్రానికి సిద్దిపేట వ్యవసాయ రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని లోకిస్తున్నది. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ. 300కోట్ల వ్యయంతో 62 ఎకరాల విస్తీర్ణం లో నిర్మాణం అవుతున్న ఆయిల్ పామ్ ఫ్యా క్టరీ, కేవలం పామ్ ఆయిల్ ఉత్పత్తి కేంద్రంగానే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో కూ డా ఒక నమూనాగా నిలవనుంది. ఇది తెలంగాణలో తొలి ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ ఆయిల్ పామ్ ప్లాంట్. రైతుల శ్రమకు తగిన ఫలితం దక్కేలా మాజీ సీఎం కేసీఆర్ చొరవతో 4 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే హరీష్ రావు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది దేశంలోనే అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మి స్తున్నారు.

ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి మలేషియాకు చెందిన అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ప్రారంభంలో రోజుకు 30 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో మొదలయ్యే ఈ మిల్, భవిష్యత్తులో 120 టన్నుల సామర్థ్యానికి విస్తరించగలదు. ఈ ఫ్యాక్టరీకి కాళేశ్వరం ప్రాజెక్టులోని రంగనాయక సాగర్ నుండి ఏటా 10 కోట్ల లీటర్ల నీరు సరఫరా కానుంది. ఈ కర్మాగారం రైతుల నుండి నేరు గా ఆయిల్ ఫామ్ గెలలను కొనుగోలు చేసి, క్రూడ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్లను ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన గింజలను క్రషింగ్ చేసి వచ్చే పామ్ ఆయిల్ కెర్నల్ ఆయిలను కూడా తయారు చేస్తుంది. ఇది కాస్మోటిక్స్ తయారీలో ఉపయోగపడుతుంది.

ఉపాధి అవకాశాలు

ప్రస్తుతం సిద్దిపేటలో రైతుల నుండి సేకరించిన ఆయిల్ ఫామ్ గెలలను ఖమ్మం జి ల్లాలోని అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ప్రారంభంలో క్వింటాలుకు రూ. 1,300 ఉన్న ధర ప్రస్తుతం రూ.1,910కి పెరిగింది. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన నాలుగేళ్ల తర్వాత నుంచి 30 ఏళ్ల వరకు ని రంతరంగా దిగుబడి వస్తుంది. మొదటి మూడేళ్లు ఆదాయం కోసం కూరగాయలు, పత్తి, మొక్కజొన్న అంతర్గత పంటలుగా వే సుకోవచ్చు.

ఈ కర్మాగారం ద్వారా ప్రత్యక్షం గా 500 మందికి, పరోక్షంగా 2,000 మం దికి ఉపాధి లభిస్తుంది. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని జూన్ నెలలో కేంద్ర వ్యవసాయ మం త్రిత్వ శాఖ బృందం సందర్శించి,అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మించబడుతోందని, ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని వా రు ప్రశంసించారు. దేశంలోనే అతి పెద్దదని, నిర్మాణం అద్భుతంగా ఉందని కేంద్ర బృం దం అభినందించింది.

గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం

2022లో కేవలం 2,774 ఎకరాల్లో ఉన్న ఆయిల్ ఫామ్ సాగు, ఇప్పుడు 14000 ఎకరాలకు పైగా విస్తీర్ణానికి పెరిగింది. ఈ సాగు ను ప్రోత్సహించేందుకు రంగనాయక సాగ ర్, ములుగు, ఎల్‌ఐగూడ గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోనే భారీ ప్రాజెక్టు...

ఈ భారీ ప్రాజెక్టును జిల్లాకు తీ సుకురావడంలో హరీష్ రావు కృ షి అపారమైనది. ఆయన దూరదృ ష్టి, పట్టుదల లేకపోతే ఈ ప్రాజెక్టు సాకారమయ్యేది కా దు. రైతులు, యువత, స్థానిక ఆర్థిక వ్య వస్థకు ఒక సుస్థిరమైన భవిష్యత్తును అం దిస్తుంది. హరీష్ రావు కృషి సిద్దిపేట ఒక వ్యవసాయ విప్లవానికి కేంద్రంగా మారుతుంది.

 మాజీ ఎంపీపీ జపా శ్రీకాంత్ రెడ్డి నంగునూరు

లాభదకమైన పంట...

ఈ పంట లాభదాయకంగా ఉండటం, మంచి ఆదాయం రా వడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయిల్ పామ్ సాగు చేయ డం వల్ల నాకు ఇప్పుడు మంచి లాభం వస్తోంది. ఈ పంటతో పాటు, మొదటి 3 సంవత్సరాలు నేను అంతర పంటలు కూడా సాగు చేసుకున్నాను. దానివల్ల నాకు ఆ సమయంలో కూడా ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు నేను 5 సార్లు పంటను కోసి అమ్మడం జరిగింది.

రైతు కారు శ్రీనివాస్ గట్లమల్యాల