calender_icon.png 19 September, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి సీఎం

19-09-2025 12:38:59 AM

  1. రాష్ట్రానికి పెట్టుబడులు సేకరించడమే లక్ష్యం 
  2. నేడు అమెజాన్, కార్ల్స్‌బర్గ్, గోద్రెజ్ తదితర కంపెనీల ప్రతినిధులతో భేటీ 
  3. బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ 12వ వార్షిక ఫోరానికి హాజరు

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణకు పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా ఆయన వివిధ కంపెనీ ల ప్రతినిధులతో శుక్రవారం భేటీ కానున్నారు. ముందుగా ఉదయం 11 గంట లకు తాజ్ ప్యాలెస్ హోటల్‌లో న్యూ జెర్సీ గవర్నర్ ఫిలిప్ డీ మర్ఫీతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఉదయం 11:30 గంటలకు బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ 12వ వార్షిక ఫోరంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు ఆమెజాన్, కార్ల్స్‌బర్గ్, కార్లుల్, గోద్రేజ్, ఉబర్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్రానికి పెట్టుబ డులకు సంబంధించిన అంశాలపై విడివిడిగా సమావేశమై చర్చిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, సీఈవో బోర్జ్ బ్రెండేతో ప్రత్యేక భేటీ కానున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలతోనూ సమావేశమవుతారని పార్టీ వర్గా లు తెలిపాయి.