calender_icon.png 24 August, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్‌పాం ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలి

24-08-2025 12:47:06 AM

- నర్మెట్ట ఆయిల్‌పాం ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి చేయాలి

- ఆయిల్ ఫెడ్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): నిర్మాణంలో ఉన్న ఆయిల్‌పాం ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరవు ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. నర్మెట్ట ఆయిల్‌పాం ఫ్యాక్టరీ, కల్లూరుగూడెం, గద్వాల జిల్లా బీచుపల్లిలో జరుగుతున్న ఆయిల్‌పాం మిల్లుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. నర్మెట్టలోని ఆయిల్‌పాం ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నారని, అందుకు సమయానికి అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.

అయిల్‌పాం పనుల పురోగతిపై మంత్రి తుమ్మల శనివారం సచివాల యంలో సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ర్టంలో ఆయిల్ పాం ప్లాంటేషన్ అనుకున్న స్థాయిలో జరగకపోవడం పట్ల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాంటేషన్ లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కల్లూరు గూడెం పనులను వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేయాలని, బీచుపల్లి ఆయిల్ పాం కర్మాగార పనుల కోసం టెండర్లు వెంటనే పిలవాలన్నారు.

విజయ ఉత్పత్తులు కల్తీ లేకుండా, నాణ్యంగా ఉండాలని, కస్టమర్ల న మ్మకం పెంచే విధంగా పనిచేయాలని మం త్రి  సూచించారు. దక్షిణ భారతదేశంలో విజ య ఉత్పత్తుల అమ్మకాలు విస్తరించేటట్టు ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో ఆటోమేటెడ్ విజయ ప్యాకింగ్ స్టేషన్ పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. సమీక్షా స మావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి  రఘునందన్‌రావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి , హర్టికల్చర్ సంచాలకులు యాస్మిన్ బాషా, ఆయిల్‌ఫెడ్, హర్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.