04-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి కోసం కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో ఒప్పంద నిబంధనల ప్రకారం పురోగతి సాధించని కంపెనీలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పురోగతి లేని ఆయిల్ పామ్ కంపెనీల ఫ్యాక్టరీ జోన్లను తగ్గిస్తూ, ఆయా ప్రాంతాలను తెలంగాణ ఆయిల్ ఫెడ్‌కు కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆయిల్ పామ్ (ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ని యంత్రణ) చట్టం, 1993, నిబంధనలు- 2008 ప్రకారం, ఆయిల్ పామ్ కంపెనీలు రైతు నాట్ల నుంచి 36 నెలల్లోపు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, ఫ్యాక్టరీ జోన్ పరిధిలో రైతులకు సేవలు అందించాల్సి ఉంటుంది.
అయితే పలు కంపెనీలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ప్రాసె సింగ్ యూనిట్ల ఏర్పాటు, నాట్ల విస్తరణ, నర్స రీ అభివృద్ధి వంటి అంశాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించింది. వ్యవసామ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు సమీక్షలు నిర్వహించినప్పటికీ ఎటువంటి పురోగతి లేకపోవడం తో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కరీంనగర్ జిల్లాలో కేటాయించిన 44,527 ఎకరాల కు 6,721 ఎకరా ల్లో మాత్రమే ఆయిల్‌పామ్ సాగులోనికి తెచ్చింది. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఫ్యాక్టరీ జోన్‌ను రద్దు చేసి తెలంగాణ ఆయిల్ ఫెడ్‌కు కేటాయించారు.
మ్యాట్రిక్స్ పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో కేటాయించిన 30,552 ఎకరాలకుగాను, కేవలం 1,606 ఎకరాలు, అదేవిధంగా కేఎన్ బయోసైన్సెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు హనుమకొండలోని 9 మండలాలు, వరంగల్ జిల్లాలలోని 2 మండలాలు కలిపి 14,000 ఎకరాలు లక్ష్యం ఇవ్వగా, కేవలం 2,136 ఎకరాలనే సాగులోనికి తెచ్చారు. ఆ జిల్లాల్లో ఫ్యాక్టరీ జోన్లను పూర్తిగా రద్దు చేస్తూ, వాటిని ఆయిల్ ఫెడ్‌కు కేటాయించారు.
నూనెల దిగుమతి తగ్గించేందుకు..
ప్రభుత్వం పంటల మార్పిడి అవసరాన్ని తెలియజేసేలా, వంటనూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ కింద రాష్ట్రంలో ఈ కార్యక్రమా న్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వ్యవసాయశాఖ సెక్రటరీ తెలిపారు.