16-05-2025 12:47:50 AM
నిజామాబాద్ మే 15: (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా మండల పరిధిలోని తిరుమనపల్లి గ్రామంలో అడ్డు అదుపు లేకుండా అక్రమ కల్ప వ్యాపారం జరుగుతోంది. ఈ అక్రమ కల్ప వ్యాపారంపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీని అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమంగా కల్ప నిలువ ఉంచిన విషయమై అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీని ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తిరుమనపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గ్రామంలోని డంపై ఉన్న కల్ప నిక్షేపాల ఒకటి దగ్ధం కావడంతో ఈ అక్రమ బాగోతం బయటపడింది. సంవత్సర కాలంగా యదేచ్చగా తాగుతున్న ఈ అక్రమ కల్ప వ్యాపారన్నీ సంబంధిత శాఖలైన ఫారెస్ట్ ఆర్ అండ్ బి అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ కల్ప వ్యాపార విషయమై విజయ్ క్రాంతి ఫోటోలతో సహా వార్తను ప్రచురించింది.
ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఫారెస్ట్ అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసిన తర్వాత స్పందించి అక్రమ కల్ప నిలువలను గుర్తించి. ఎస్. కే తాజుద్దీన్ అనే వ్యక్తి పేరా గత నెల 7వ తేదీన రూ:5,235 రూపాయల జరిమానా విధించింది. అక్కడి నుంచి కలపను ఇతర చోటికి తరలించాలని ఆదేశించినట్లు ఫారెస్ట్ శాఖకు అధికారులు తెలిపారు.
అక్రమంగా నిల్వ ఉన్న కలపను అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు అన్నదే ప్రశ్న. మంత్రంగా జరిమానా విధించి చేతులు దులుపుకున్నారు. క్రమంగా కలప నిల్వలు కనబడితే స్వాధీనం చేసుకొని తమ డిపోకు తరలించాల్సి ఉండగా ఫారెస్ట్ అధికారులు నిమ్మకు నీలెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉన్న కలప తనదని సంబంధిత రసీదులు ఫోటోలు తెస్తే అప్పుడు కలప విడుదల చేయాల్సి ఉంటుంది.
కానీ అధికారులతో మాకు ఏమీ పట్టనటు వ్యవహరించి పరోక్షంగా అక్రమ కల్ప వ్యాపారానికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు గ్రామస్తులు నుండి వస్తున్నాయి. లక్షల రూపాయల విలువచేసే కలప నిలువలను అక్రమంగా నిల్వ చేసినప్పటికీ ఆ కలప ఎక్కడిది...? అటవీ శాఖకు చెందిన... లేక రోడ్లు భవనాల శాఖకు చెందినవా అన్నది తేలడం లేదు.
అక్రమంగా ఆర్ అండ్ బి రోడ్ల వైపున నాటిన చెట్లను సైతం నరికి వేస్తున్నారని వచ్చే బావ సూచనలు కనిపించిన కొద్ది గంటల ముందు చెట్లకి చిన్న రంధ్రాలు చేసి రాత్రులు వాటిలో నిప్పు అంటుకునే పదార్థాలతో నింపి మంట పెట్టి చెట్లు నేల కూలిపోయేలా చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.
రహదారులకు అడ్డంగా పడిన చెట్లని రోడ్ల నుంచి తొలగించామని కింద పడిపోతే తీసుకున్నామని అక్రమ కల్ప నిల్వదారులు చెబుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆర్ అండ్ బి రోడ్డుకు పక్కనే షెడ్డు వేసి ఆ షెడ్డులో నుండి అక్రమ కల్ప వ్యాపారం కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమ కల్ప విషయమై ఫారెస్టు అధికారులు దృష్టికి తీసుకువెళ్లగా.
క్రమంగా నిల్వ ఉన్న కలప మా దృష్టి మాది కాదని మీ ఆ రెండు బీ చెట్లని ఫారెస్ట్ అధికారులు అంటుండగా, ఆ రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆ కలప మాది కాదని అది ఫారెస్ట్ అధికారులకు సంబంధించిందని వారు అంటున్నారు. జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా స్పందించిన అధికారులు తాజుద్దీన్ కి జరిమానా విధించారు.
జరిమానా విధించాను ఇంక నన్ను అడ్డుకునే వారు ఎవరని రెచ్చిపోయి మరి అక్రమ కల్ప వ్యాపారం నిర్వహిస్తున్నట్టు గ్రామస్తుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ అక్రమ కల్ప విషయమై ఫారెస్ట్ అధికారులు రోడ్లు భవనాల శాఖ అధికారులు పట్టించు పోవడం లేదని. ఫిర్యాదు చేసినప్పటికీని అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు ఆరోపించారు.
ఈ విషయమై విజయక్రాంతి ఆర్ అండ్ బి అధికారులు దృష్టికి తీసుకువెళ్లగా డి ఈ తో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుని రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన తొలగిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ కల్ప కు సంబంధించి సంబంధించి రహదారిలో ఉండే చెట్లను నరికినట్లైతే కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు ఇస్తామని ఆర్ అండ్ మీ అధికారులు హామీ ఇచ్చారు.