calender_icon.png 11 May, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ నిఘా నీడలో గచ్చిబౌలి స్టేడియం

11-05-2025 12:18:28 AM

-మిస్ వరల్ పోటీలకు 350 మంది పోలీసు సిబ్బందితో భద్రత

శేరిలింగంపల్లి, మే 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్ ఈవెంటు ను కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు మాదాపూర్ జోన్ డీసీపీ డా.వినీత్ తెలిపారు.

శనివారం గచ్చిబౌలి స్టేడియం లో జరగబోయే ఓపెనింగ్ సెర్మనీకి టూరిజం శాఖ జారీ చేసిన పాసులు ఉన్నవారినీ మాత్రమే స్టేడియం లోపలికి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. స్టేడియం ప్రాంగణంలో 350 మంది పోలీసులు బందోబస్తులో ఉంటున్నట్లు తెలిపా రు.

ఇప్పటి వరకు వివిధ దేశాల నుండి 103 మంది కంటెస్టెంట్లు ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నగరానికి  వచ్చారని అన్నారు. దేశ సరిహద్దుల్లోని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని టైట్ సెక్యూ రిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం, హెచ్‌ఐసీసీ, కంటెస్టెంట్లు బస చేసే హోటళ్ల వద్ద నిరంతరం భద్రత కట్టుదిట్టం చేశామన్నారు.

సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. మాదాపూర్ జోన్ పరిధిలో క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచామన్నారు. పెట్టామన్నారు. మిస్ వరల్ కంటెస్టెంట్లు ప్రయాణించే రహదారులలో ఎలాంటి సంఘటనలు జరగ కుండా ట్రాఫిక్,లా అండ్ ఆర్డర్ కట్టుదిచిట్టం చేసినట్లు తెలిపారు.