01-09-2025 01:30:08 AM
-హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌లో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): హైదరాబాద్ ప్రసూతి మరి యు గైనకాలజికల్ సొసైటీ (ఓజీఎస్‌హెచ్) సహకారంతో యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, ప్రసూతి, గైనకాలజీ విభాగం, డాక్టర్ అనిత కున్నయ్య నేతృత్వంలో ఆదివారం గై నకాలజీ వైద్య రంగంలో అత్యాధునిక రోబోటిక్ వైద్య విధానాలను జాతీయ గైనకాలజీ వైద్య నిపుణులతో వర్క్ షాప్, ఇంటరాక్టివ్ శిక్షణా సెషన్స్‌ను గైనిక్ రోబోకాన్ పేరిట నిర్వహించారు.
ఈ జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్‌లో హైదరాబాద్ ప్ర సూతి, గైనకాలజికల్ సొసైటీ గత అధ్యక్షురాలు డాక్టర్ ఎస్ శాంతకుమారి (కోశాధి కారి, ఎఫ్‌ఐజీవో), ఓజీఎస్‌హెచ్ అధ్యక్షురాలు డాక్టర్ జయంతిరెడ్డి, ప్రముఖ అంత ర్జాతీయ అధ్యాపకులు డాక్టర్ పీటర్ సి. లిమ్, మెడికల్ డైరెక్టర్, రోబోటిక్ సర్జరీ సెం టర్ ఆఫ్ హోప్, నెవాడా, యూఎస్‌ఏ, డాక్ట ర్ మహేంద్ర భండారి, సీఈవో, వట్టికూటి ఫౌండేషన్ మరియు భారతదేశంలో రోబోటిక్ సర్జరీకి మార్గదర్శకులు, దేశం నలుమూ లల నుండి వచ్చిన 500 మందికి పైగా గైనకాలజిస్టులు, సర్జన్లు పాల్గొన్నారు. డాక్టర్ అనిత కున్నయ్య మాట్లాడుతూ.. రోబోటిక్ సర్జరీలు, సర్జన్లను భర్తీ చేయడానికి రుపొందించబడినవి కాదని, వారి సామర్థ్యాలను పెంపొందించడానికి, మరింత మెరుగుపరచడానికి రుపొందించినవి అని అన్నారు.
గైన కాలజీ వైద్య రంగంలో, పెద్ద గర్భాశయం, మైయోమెక్టమీ, సంతానోత్పత్తిని పెంచే విధానాలు, ఎండోమెట్రియోసిస్ మరియు సంక్లి ష్టమైన అడెనోమైయోసిస్ వంటి శస్త్రచికిత్సలను నిర్వహించడంలో రోబోటిక్-సహాయక శస్త్రచికిత్సలు ఎంతో అభివృద్ధి చెంది మెరుగైన జీవన నాణ్యతను మెరుగుపరిచాయని తెలియజేశారు. యశోద హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్, డాక్టర్ ఎ. లింగయ్య మాట్లాడు తూ.. రోబోటిక్ సర్జరీ గత దశాబ్ద కాలంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికి భారతదేశంలోని కోన్ని వై ద్య కేంద్రాలలో మాత్రమే రోబోటిక్ సర్జరీల ప్రాక్టీస్ అందుబాటులో ఉన్నాయన్నారు.