calender_icon.png 2 October, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని ఒకరి మృతి

02-10-2025 02:20:09 AM

శామీర్ పేట్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడగా ఒకరు మరణించిన ఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం అడ్రస్ పల్లి గ్రామానికి చెందిన దొండ తనుష్ (16), బి సాయి దీపక్ (16) డీజిల్ కోసం కారులో మూడు చింతలపల్లి కి వెళ్లారు. తిరిగి అడ్రస్ పల్లికి వెళ్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది.

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం కీసరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తనుష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సాయి దీపక్ అల్వాల్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శామీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.