calender_icon.png 27 August, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

25-08-2025 12:33:31 AM

  1. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ సుబ్బారావు
  2. యూనివర్సిటీలో క్రీడా సమ్మేళనం

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు యోగ, సంగీతం, క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం సుబ్బారావు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఆదివారం విజ్ఞాన్స్ యూనివర్సిటీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాలల సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించిన క్రీడా సమ్మేళనం ఘనంగా ముగిసింది.

విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం సుబ్బారావు మాట్లాడుతూ.. ఆటల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం వలన జిజ్ఞాస, సమర్ధ సమయ పాలన, బుద్ధి స్థిరత్వం, వేగంగా సంగ్రహించుకోగలగడం... ఇలా ఎన్నో అంశాల్లో అభివృద్ధి చెందుతారన్నారు. క్రీడలు శారీరక ఉల్లాసానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడుతాయని అన్నారు.

శ్రీ వశిష్ట జూనియర్ కళాశాలల జీఎం వంశీచంద్ర మాట్లాడుతూ.. విద్యార్థులందరూ ప్రతిరోజు ఏదో ఒక గేమ్ ఆడాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి ఫిజికల్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్రీడా సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డారు. అసోసియేట్ డీన్ రాఘవేంద్ర, ప్రిన్సిపల్స్ సతీశ్, రంజిత్‌లతో పాటు ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.