calender_icon.png 29 January, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

29-01-2026 12:13:56 AM

చేవెళ్ళ, జనవరి 28 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తొలిరోజు వివిధ పార్టీల నుండి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. చేవెళ్ల మున్సిపలిటీలో 9 నామినేషన్లు దాఖలయ్యాయని  మున్సిపల్ చైర్మన్ వెంకటేశం తెలిపారు. శంకర్ పల్లి నుంచి ఐదు నామినేషన్లు వచ్చాయని ఆ మున్సిపాలిటీటి కమిషనర్ యోగేష్ తెలిపారు. మొయినాబాద్ మున్సిపాల్ లో మొత్తం 6 నామినేషన్లు వచ్చాయని మున్సిపాల్ కమిషనర్ మహమ్మద్ జాకీర్ అహ్మద్ తెలిపారు.

ఆమనగల్లు మున్సిపాలిటీలో 8 షాద్నగర్ మున్సిపాలిటీలో ఆరు  నామినేషన్ ధాఖలయ్యాయని ఆయా మున్సిపల్ కమిషనర్లు పేర్కొన్నారు. అయితే షాద్నగర్లో ఒక అభ్యర్థి రెండు నామినేషన్ షర్ట్లు దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నం లో మూడు నామినేషన్లు దాఖలు  చేశారు.ఈ ఆరు మున్సిపాలిటీలలో తొలిరోజు 38 నామినేషన్లు వచ్చాయి. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ లో పాల్గొన్నప్పటికీ ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు.