calender_icon.png 29 January, 2026 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

29-01-2026 12:15:08 AM

రంగారెడ్డి, జనవరి 28 (విజయక్రాంతి): జిల్లాలో 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. ఎన్నికల విధులకు సిబ్బంది కేటాయింపు, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ప్రక్రియలో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు అవసరమైన సిబ్బందిని ఎంపిక చేశారు. ప్రిసైడింగ్ అధికారులు (PO), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (APO), ఇతర పోలింగ్ అధికారులు (OPO), ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసిన ఈ సిబ్బందిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

శిక్షణ, తదుపరి చర్యలు

ఎన్నికల విధులకు ఎంపికైన సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి బాధ్యతలపై స్పష్టతనిచ్చేందుకు మాస్టర్ ట్రైనర్స్ చే ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విధులకు ఎంపికైన సిబ్బందికి తక్షణమే నియామక పత్రాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణరెడ్డి, నోడల్ అధికారి శ్రీలక్ష్మి తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.