02-11-2025 04:46:33 PM
సుమారు నాలుగు అడుగుల లోతు, గుంతను తవ్వి పూజలు చేసిన గుర్తుతెలియని వ్యక్తులు..
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఆదివారం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎస్సీల సమాధుల వద్ద, రెండు రాతి గుండ్ల మధ్యలో వ్యక్తులు నిమ్మకాయలు కోసి, కొబ్బరికాయలు కొట్టి, పసుపు కుంకుమ చల్లి పూజలు చేసిన తర్వాత తవ్వకాలు జరిపినట్లు తెలియజేస్తున్నారు. దీనితో గ్రామంలో ఒక్కసారిగా జనాల్లో భయంగా ఆందోళన చెలరేగాయి. గ్రామంలో ఎవరు చేశారో ఎందుకు చేశారో అర్థం కావటం లేదని గుంపులు గుంపులుగా చర్చించుకుంటున్నారు. సుమారు నాలుగు అడుగుల లోతు గుంతను తవ్వారు. జరిగిన సంఘటనపై అధికారులు, పోలీసులు విచారణ చేపట్టి, తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.