23-05-2025 01:17:44 AM
అబ్దుల్లాపూర్‌మెట్, మే 22: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలలోని గ్రామాలు, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలోని ఎస్‌ఎన్‌ఆర్ కళా కన్వెన్షన్ హాల్ నిర్వ హించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల ని ర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గా లుం టే.. ఒక్కొ అసెంబ్లీ స్థానానికి 3500 ఇండ్లు చొప్పున కేటాయింపులు జరిగాయి. సీఎం రేవంత్, మంత్రి, హౌసింగ్ ఎండీలతో మా ట్లాడి.. 3500లతో పాటు.. అదనంగా మరో 1000 ఇండ్లను మన ఇబ్రహీంపట్నానికి తీసుకొచ్చానన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండల, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో 804 మొదటి విడుత కింద మం జూరైన్నట్లు తెలిపారు. ఒక్కొ ఇంటికి నిర్మాణానికి రూ. 5లక్షల చొప్పున.. 66 గజాలలో ఇండ్లు నిర్మించుకోవాలన్నారు. నాలుగు వి డుతలుగా బిల్లులు మంజూరు అవుతాయన్నారు. బిల్లుల కోసం ఎవ్వరి అడగా ల్సిన పనిలేదని.. మీరే ఇంటి నిర్మాణ ఫొటో లు తీసి.. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే.. డైరెక్ట్ మీ అకౌంట్‌లోకి జమా అవుతాయన్నారు.
తెలి సి.. తెలియకుండా ఎవ్వరికీ లంచం ఇవ్వొదన్నారు. లబ్దిదారులు మూడు నెలలోనే ఇం డ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించా రు. ఇండ్లు నిర్మించలేని పరిస్థితిలో ఉండే ముం దే చెప్పితే.. అర్హులైన వారికి కేటాయిస్తామన్నారు. రెండోవిడుతలో మళ్లీ వాళ్లక ఇచ్చే విధంగా చూస్తామన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా 5లక్షల మంజూరు కాగ బిల్లుల కో సం ఎవ్వరికీ రూ. 50పైసల లంచం ఇవ్వడానికి చోటు లేదన్నారు.
కంప్యూటీకరణలో చే శారని.. అదే పద్దతిలో బిల్లులు డైరెక్ట్‌గా అ కౌంట్‌లోకి వచ్చేస్తాయన్నారు. రానున్న రో జుల్లో నియోజకవర్గానికి మరో 20 వేల ఇం డ్లు పేదలకు ఇచ్చేవిధంగా కృషి చేస్తానన్నా రు. గత పాలకులు మన ప్రాంత భూములన్నీ అమ్మి.. ఖజాన నింపుకున్నారు తప్ప... ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపే ఇండ్లు నిర్మించుకోవాలన్నారు.
నియోజకవర్గ పరిధిలో ఇండ్ల నిర్మాణాలను తనే దగ్గరుండి పర్యవేక్షిస్తానని అన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మండలంలో ఎంపీడీవో, స్పెలా ఫీస ర్, అలాగే హౌసింగ్ అధికారి, మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లు ఉంటారన్నారు. ఇం డ్ల నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయడానికి ఎవ్వరైతే కృషి చేస్తారో వారికి తగిన పా రితోషికం అందచేస్తామన్నారు.
ఈ కార్య క్ర మంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, మండల స్పెలాఫీసర్, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీవో మధుసూ దనచారి, హౌసింగ్ ఏఈ, పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.