calender_icon.png 23 December, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లాసులు నిల్.. ఫీజులు ఫుల్.!

23-12-2025 12:45:53 AM

నిబంధనలకు విరుద్ధంగా అక్షర ఒకేషనల్ కాలేజీ నిర్వహణ - దూడలకు 

ఎడ్లకు ఆవాసంగా కాలేజీ ప్రాంగణం

చదువుకు ఆమడ దూరం - అధికారుల అండదండలతో ఫీజులే లక్ష్యంగా కాలేజీ నిర్వహణ

డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామ్ చరణ్ తేజ

ఆళ్లపల్లి, డిసెంబర్ 22, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో గల అక్షర ఒకేషనల్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ క్లాసులు నిర్వహించకుండా విద్యార్థుల వద్ద నుండి ఫీజులు వసూలే లక్ష్యంగా ఈ కాలేజీ నిర్వహణ ఉందని డిఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామ్ చరణ్ తేజ్ ఆరోపించారు. సోమవారం కళాశాలను సందర్శించిన రామ్ చర ణ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థులను కాలేజీలో జాయిన్ చేసుకొని, వారికి క్లాసులు నిర్వహించకుండా చదువులకు దూరం చేసి, వారి వద్ద నుండి వచ్చే ఫీజులే లక్ష్యంగా కాలేజీ నడుపుతున్నారన్నారనీ ధ్వజమెత్తారు.

పైగా ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ కోసం సెల్ఫ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. లెక్చరర్స్ స్టాప్ లేకుండా కాలేజీ నడవకపోవ డంతో విద్యార్థులు కాలేజీ విద్యకు దూరమవుతున్నారన్నారు. కాలేజీలో ఎం.ఎల్.టి, ఇ.టి, సి.ఎస్.ఇ ( కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ), ఎం.పి.హెచ్.డబ్ల్యూ (నర్సింగ్) ఈ కోర్సు లు కాలేజీలో నడుస్తున్నాయి. కాలేజీలో క్లాసులు లేకుండా ప్రాక్టికల్స్ లేకుండా నర్సింగ్ విద్యార్థులకు ట్రైనింగ్ లేకుండా కోర్సు పూర్తయ్యే నాటికి విద్యార్థులకు ఫేక్ చదువు సర్టిఫికెట్లు అందిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి, స్థానిక ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఉపయోగం లేకుండా పోయిందన్నారు.

అధికారుల అండదండలతోనే కా లేజీ యాజమాన్యం వారి సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే ఫేక్ చదువు చెప్తూ కాలేజీ నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కాలేజీలకు సరైన ఫ్యాకల్టీ ఉపాధ్యాయులు లే కుండా, విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకుండా, చదువు చె ప్పకుండా వారి వద్ద నుండి ఫీజుల రూపంలో ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా నిర్వహిస్తున్నారన్నారు. కాలేజీ నడవకపోవ డంతో దూడలు కట్టేసుకోవడానికి, వడ్లు ఆరబెట్టుకోవడానికి కాలేజీ ప్రాంగణాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి, ఒకేషనల్ బోర్డు, స్థానిక ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ మండలాల్లో ఒకేషనల్ కళాశాల పేరుతో విద్యార్థులను దోపిడీ చేస్తున్నారనీ. వాటి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.